బైరాన్ పల్లి, సిద్ధాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు …
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని బైరాన్ పల్లి, సిద్ధాపూర్,గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు శ్రీ కల్లెబోయిన కుమారస్వామి, మంద రాజు మరియు వార్డ్ మెంబర్ల గెలుపు కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు విచ్చేసారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు ని గ్రామంలోని మహిళామణులు సంప్రదాయ కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు సర్పంచ్ అభ్యర్థులను మరియు వార్డు సభ్యులతో కలిసి ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపించాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ:-…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యంతో పేద ప్రజల కడుపు నింపుతుందని తెలిపారు. గత ప్రభుత్వ 10ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిందని అన్నారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తుందని తెలిపారు..
బైరాన్పల్లి గ్రామ అభివృద్ధి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా…
బైరాన్ పల్లి సర్పంచ్ గా కల్లెబోయిన కుమారస్వామి గెలిపితే గ్రామ మహిళా సంఘ భవనం, రైతులకు పంట పొలాలకు రోడ్లు, పోచమ్మ దేవాలయం, అంబేడ్కర్ విగ్రహం, జిమ్ సెంటర్ గ్రామ సమస్యలు అన్నింటినీ పరిష్కారం అలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు 24 ఇండ్లు ఇచ్చాము సర్పంచ్ నీ గెలిపితే మరొక 30 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తా ఇప్పటికే గ్రామానికి నా SDF నిధుల నుంచి 30 లక్షలు కేటాయించాను. రేషన్ కార్డులు, 18 సం. నుంచి పండు ముసలి వరకు ఇందిరమ్మ చీరలు, గ్రామాల్లో నూతన పింఛన్లు, మహిళమణులకు తర్వలోనే 2500, గత ప్రభుత్వం ఒక డబుల్ బెడ్ ఇల్లు ఇవ్వలేదు కానీ నేడు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి దయచేసి ప్రతి ఒక్కరూ కళ్లబోయిన కుమారస్వామి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు…
సిద్దాపూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లావేళ కృషి చేస్తా…
సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ గా మంద రాజు ను భారీ మెజారిటీతో గెలిపించండి. నా చిన్న కొడుకు లాంటి వాడు కష్టపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పేదవాడు మీ గ్రామాన్ని మంచి చేసే వ్యక్తి గ్రామ ప్రజలందరూ గమనించి రాజు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలను కోటి మందిని కోటేశ్వరీరాలుగా తీర్చిద్దేందుకు కృషి చేసేందుకు మహిళలకు పెట్రోల్ బంక్, సోలార్ పవర్, బస్సులు, వడ్డీలేని రుణాలు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ గ్రామానికి ఇప్పటికే 24 ఇండ్లు ఇచ్చా రేపు రాజును గెలిపించండీ మరొక 30 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తా ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రకియ అలాగే గ్రామంలో అన్ని సమస్యలను ఒకటి ఒకటిగా పూర్తి చేస్తాఅని అని మంద రాజు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు..
అర్వపల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన అంబాల ప్రభాకర్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు …
అర్వపల్లి గ్రామ సర్పంచ్ గా అంబాల ప్రభాకర్ ని ఏకగ్రీవంగా చేసిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు మెంబర్లను కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఇందిరమ్మ చీరలు 18 సం. నుంచి పండు ముసలి వరకు ఇందిరమ్మ చీరలు, గ్రామాల్లో నూతన పింఛన్లు, మహిళమణులకు తర్వలోనే 2500, గత ప్రభుత్వం ఒక డబుల్ బెడ్ ఇల్లు ఇవ్వలేదు కానీ నేడు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి గుర్తుకు చేశారు….
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
