14 ఏళ్లు పూర్తయిన ఆడ పిల్లలందరూ క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్.

TEJA NEWS

14 ఏళ్లు పూర్తయిన ఆడ పిల్లలందరూ క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్.

వ్యాధి రాకముందే అరికట్టాలి ..

మార్చి 11వ తేదీ నుండి 3 నెలల పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వ్యాక్సినేషన్ జరుగుతుంది.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద నివహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యాధి వచ్చాక చికిత్స కోసం ఇబ్బంది పడటం కంటే.. రాకుండా ముందుగానే నివారించుకోవడం ఉత్తమమని సూచించారు. ముఖ్యంగా ఆడవారిని వేధించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన HPV వ్యాక్సిన్ ఒక గొప్ప రక్షణ కవచమని ఆమె పేర్కొన్నారు. మార్చి 11వ తేదీ నుండి మూడు నెలల పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కార్యక్రమం జరుగుతుందని 14 ఏళ్లు పూర్తయిన ఆడపి ల్లలందరూ HPV టీకా తీసుకోవడానికి అర్హులని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వి సుజాత, HPV వ్యాక్సినేజేషన్ నోడల్ ఆఫీసర్ డా.అమరేందర్ నాథ్ రెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఉమామహేశ్వరి, జొన్నవాడ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్లు డా. అహ్మద్ బాబు, డా. వినయ్ కుమార్, బుచ్చి చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి పట్టణ అధ్యక్షులు గుప్తా శ్రీనివాసరావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య, టిడిపి సీనియర్ నాయకులు బత్తల హరి కృష్ణ లతో పాటు బుచ్చిరెడ్డి పాళెం మండల టిడిపి మరియు కూటమి నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top