థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం
థాయ్‌లాండ్‌లో Air India విమానానికి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానంలోని ల్యాండింగ్ గేర్ దెబ్బతినడంతో విమానం భారీ కుదుపులకు లోనైంది.
ఈ ఘటనలో గేర్ విరిగిపోవడంతో విమానం ప్రమాదకర పరిస్థితుల్లో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఉదయం 6.42 గంటలకు Hyderabad నుంచి థాయ్‌లాండ్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
