పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి

TEJA NEWS

పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి

  • శ్రీ కృష్ణదేవరాయ విద్యాభివృద్ధి కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలు కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు వర్గాల పేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయం : ప్రత్తిపాటి.
  • కూటమిప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుంది : ప్రత్తిపాటి.

కూటమిప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ దేశం గర్వించేలా అభివృద్ధి చెందుతుందని, అప్పుడే ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శ్రీ కృష్ణదేవరాయ విద్యాభివృద్ధి కమిటీ, ఆంధ్రప్రదేవ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం, పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి మాట్లాడారు. కూటమిపార్టీల కలయిక రాష్ట్రప్రజలకు స్వేచ్ఛా సంతోషాలు తీసుకొచ్చిందన్న ప్రత్తిపాటి, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 67 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం ఒకేరోజు 8,700కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేసిన ఘనత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లకే దక్కుతుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఐక్యతే మనందరి బలమని, ఆయనలానే మిగతా నాయకులుకూడా విశాలధృక్పథంతో ఆలోచించాలని ప్రత్తిపాటి సూచించారు. గత ప్రభుత్వం ప్రజలు.. నాయకులతో పాటు, సామాజికవేత్తలు. స్వచ్ఛందసంస్థల నిర్వాహకుల్ని కూడా తీవ్రంగా ఇబ్బందిపెట్టిందని ప్రత్తిపాటి చెప్పారు. తమ వర్గాల్లోని పేద విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలుస్తున్న శ్రీ కృష్ణదేవరాయ విద్యాభివృద్ధి కమిటీ, ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, సభ్యుల్ని ప్రత్యక్షంగా అభినందిస్తున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించి ఉన్నత చదువుల దిశగా వారిని ప్రోత్సహించడం మంచి నిర్ణయమని ప్రత్తిపాటి కొనియాడారు. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి తోట రాజారమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, తోట బ్రాహ్మస్వాములు, మిరియాల రత్నా కుమారి, రాయల శ్రీనివాస్, బత్తినేని శ్రీనివాసరావు, రావు సుబ్రమణ్యం, చెన్నకేశేవుల రమేష్, బలిశెట్టి విజయ్ కుమార్, అంకిరెడ్డి రమేష్ తదితరులున్నారు

You cannot copy content of this page

Scroll to Top