బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు మద్దతు

TEJA NEWS

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు మద్దతు

తిరుపతి: స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగులు “వారానికి ఐదు రోజులు పని” అమలు చేయాలని కోరుతూ చేసిన సమ్మెకు సిఐటియు జిల్లా నేతలు పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్.జయచంద్ర, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిఐటియు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మె విజయవంతం కావాలని అన్నారు. బ్యాంకు ఉద్యోగులపై రోజురోజుకు పనిభారం అధికమవు తోందని, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, సమయపాలన మించి విధులు నిర్వహించాల్సి వస్తుందని తెలిపారు.

వారానికి ఐదు రోజులు పని విధానం ప్రవేశపెట్టాలని బ్యాంకు ఉద్యోగులు ఐక్యంగా పోరాడటాన్ని అభినందించారు. రిజర్వ్ బ్యాంకు, ఎల్ఐసి సంస్థలో, ఫైనాన్స్ సంస్థలలో వారానికి ఐదు రోజులు పని విధానం అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం బ్యాంకులను దివాలా తీయడానికి ప్రైవేటుపరం చేస్తున్నారని అన్నారు. బ్యాంకులు ప్రైవేటుపరం చేయొద్దని సిఐటియు యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

బ్యాంకు ఉద్యోగులు కోరుతున్న విధంగా వారానికి ఐదు రోజులు పని విధానం అమలుకు ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా…ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం కార్మిక చట్టాల రక్షణ కోసం, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో చేస్తున్న సమ్మెలో భాగస్వామ్యం కావాలని బ్యాంకు ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పి.బుజ్జి, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.మునిరాజా, శివ, బ్యాంకు ఉద్యోగ సంఘం నాయకులు ధన్వంతర కుమార్, గిరికుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top