25 ఏళ్ల తర్వాత మున్సిపల్ మహిళ రిజర్వేషన్

TEJA NEWS

25 ఏళ్ల తర్వాత మున్సిపల్ మహిళ రిజర్వేషన్

నాడు ప్రత్యక్షం నేడు పరోక్షం
మహిళా రిజర్వేషన్ల తో గందరగోళం, తారుమారైన నాయకులఅంచనాలు
సతులు, వారసులు పుర సమరానికి సిద్ధం
వనపర్తి
గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీ గా మారిన అప్పటినుండి ఇప్పటివరకు 2005 లో ఒక్క సారీ మాత్రమే రిజర్వేషన్ తో మహిళ చైర్మన్ కావడం జరిగిందని మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కావడం జరిగిందని నాడు చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక ఉండడంతో నేరుగా పట్టణ ప్రజలే ఓట్లు వేసిఎన్నుకోవడం జరిగింద కానీ నేడు పరోక్ష పద్ధతిగా గెలుపొందిన కౌన్సిలర్లు బల నిరూపణతో చైర్మన్ ను ఎన్నుకోవడం జరుగుతుందని కానీ ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్ను ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల పట్టణానికి ప్రజలకు నేరుగా మున్సిపల్ ద్వారా ఎవరి ఆజమాయిషి భయాలు లేకుండా స్వేచ్ఛగా సేవ చేసే అవకాశం ఉంటుందనీ అయితే పరోక్ష పద్ధతిలో ప్రజలు కౌన్సిలర్లను తమకేదో చేస్తారన్న ఎంతో నమ్మకంతో గెలిపించి కౌన్సిల్ కు పంపిస్తే ఒక పార్టీ సింబల్ తో గెలిచిన అభ్యర్థి పదవి కాసుల ఆశలతో రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయింపులను కొనసాగిస్తూ వార్డ్ అభివృద్ధి కోసమే అని జంపు జిలాని లు నమ్మబలకడం విశేషం అలా ఎన్నుకోబడిన చైర్మన్ తమకు అనుకూలంగా లేడనో వార్డు అభివృద్ధి కి అడ్డుపడుతున్నాడనో రాజకీయ కారణాలతో లేదా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయనో అవిశ్వాసం పేరుతో మరోమారు చైర్మన్ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం రావడంతో ఊసరవెల్లి రంగులు మారినట్లుగా పార్టీలు మారుతూ కౌన్సిలర్ పదవులను ఉన్నత పదవులు,కాసుల కోసం మరో మారు ఓటు వేసేందుకు అమ్ముడు పోయేందుకు సిద్ధమవుతున్నారు ఇలా పార్టీ ఫిరాయింపులతో పట్టణ వార్డు అభివృద్ధిని మరచి పోతున్నారు

ప్రజల నమ్మకాన్ని ప్రజాస్వామ్యాన్ని కి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు వ్యాపోతున్నారు ఇది ఇలా ఉంటే గత కౌన్సిల్ పాలనా కాలం ముగిసి సంవత్సరం పూర్తయిన తర్వాత మొదలైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్లు తారుమారు అవ్వటం చైర్మన్ పదవికి మహిళా రిజర్వేషన్ కావడం 33 వార్డులలో సగానికి పైగా మహిళా రిజర్వేషన్ కావడంతో వార్డులలో అంతవరకు సిట్టింగ్ కౌన్సిలర్లు గా ఉన్నవారు కార్యకర్తగా నాయకులకు ఎదిగి కొత్తగా కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లు అలాగే కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలుపొంది చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేసే ఆశావాహులుఎంతోకాలంగా ఓటర్లతో మమేకమై న వారు చాలామంది ఉండటం అలాగే ఎంతో కాలంగా ఆయా పార్టీలను నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ళు బీఫామ్ దక్కకపోతే రెబల్గా లేదా ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమైన వారు నేడు విడుదలైన రిజర్వేషన్ల ప్రక్రియతో ఆశావాహుల ఆశలపై నీళ్లు జల్లినట్లుంది జెండ్రల్ అయినా వార్డులలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇంకొంతమంది వారి స్థానంలో వారి సతులను పోటీకి సిద్ధం చేస్తా ఉన్నారు వీరు గెలుపొందేందుకు ఎత్తులు జిత్తులు తోపాటు సర్వశక్తులను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది కౌన్సిలర్ అభ్యర్థుల పరిస్థితి ఇలా ఉంటే చైర్మన్ స్థానానికి పోటీ లు ఉండబోయే నాయకులు మాత్రం ముప్పై మూడు వార్డులలో గెలుపు గుర్రాలతో ఇప్పటి నుండే టచ్ లో ఉంటూ గెలుపొందేందుకు కావలసిన బలాన్ని బలగాన్ని సమకూరుస్తూ గెలుపొందిన తర్వాత చైర్మన్ పోటీలో ఉండబోయే తమకు సపోర్టు చేసేందుకు హామీలు అగ్రిమెంట్లను తీసుకుంటున్నారని తెలుస్తోంది

అయితే ఇంతవరకు ఆయా పార్టీల తరఫున సెట్టింగ్ కౌన్సిలర్లు గానీ మాజీ కౌన్సిలర్లుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారు వారి వార్డులలో మహిళా రిజర్వేషన్లు కావడంతో వేరే వార్డు పోటీ చేస్తూనే సిట్టింగ్ స్థానాల్లో వారి సత్తులను అలాగే వారి వారసులు కుమార్తెలను, సుపుత్రులను పోటీల్లో రెండేసి స్థానాల్లో బరిలో నిలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతు పుర సమరానికి సిద్ధమవుతున్నారు వీరి పరిస్థితి ఇలా ఉంటే ఓ పార్టీ నేత సతీమణి కూడా పుర పోరు కు సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా ఈసారి అభ్యర్థుల ఎన్నిక అంత ఆషామాసిగ్గా కనిపించడం లేదని పుర పోరు ఓ సమరంలా సాగవచ్చని సర్వత్ర చర్చ జరుగుతుంది ఏం జరుగుతుందో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందోవేచి చూడాల్సిందే మరి .

You cannot copy content of this page

Scroll to Top