జమ్మి పాళెం లోనూతన బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన కొల్లా బ్రదర్స్
నెల్లూరు జిల్లా కోవూరుఇనమడుగు గ్రామంలో అరుంధతివాడ జమ్మి పాళెం వెళ్లే రహదారి మధ్యలో ఉన్న లోతు కాలువ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో మొదలైన పనులు.బ్రిడ్జి నిర్మాణ పనులును ఇరిగేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొన్న కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇనమడుగు గ్రామ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ ఇనమడుగు జమ్మిపాళెం కూటమి నాయకులు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి వేమిరెడ్డి దంపతులకు అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. ఇనమడుగుగ్రామ ఉపసర్పంచ్ చేజర్ల మోహన్ గిద్దలూరు ఉమా, ప్రత్తిపాటి మునీంద్ర, ఆత్మకూరు శీనయ్య, గిద్దలూరు సుబ్బారావు, నన్నూరు సుబ్రహ్మణ్యం, బర్రి సురేష్, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
