వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన వెంకటేష్ గౌడ్
శంషిగూడ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ ఆశా నగర్ హైటెన్సన్ లైన్ రోడ్డు లోని నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ (బాక్స్ డ్రైన్) నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేసారని కాలనీ ప్రజలు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వారు సమస్యను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వరద నీటి కాలువ నిర్మాణ పనుల పురోగతి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతుల కోసం పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందని, టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందని, వారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి త్వరలో వరద నీటి కాలువ నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తారని వెంకటేష్ గౌడ్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత జి.ఎచ్.ఎం.సి ఇంజనీరింగ్ అధికారులకు తెలియచేసారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, అగ్రవాసు, సత్యనారాయణ, మహేష్, పుల్లారావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
