చనిపోయిన కార్మిక కుటుంబానికి నష్టపరిహారం అందజేత
*భాదితులకు న్యాయం జరిగేలా చేసిన బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి
పటాన్ చెరు:
పటాన్ చెరు నియోజక వర్గంలోని సుల్తాన్ పూర్ ఇండస్టీ ఐటీ పార్క్ ఏరియాలో “ఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ లో గత నాలుగు నెలల నుండి వెంకటేష్ అనే కార్మికుడు కంపెనీలో పనిచేసేవారు. కంపెనీలో పని చేస్తున్న టైంలో జాగ్రత్తలు… సేఫ్టీ పాటించకుండా…జేసీబీ ట్యాంకు నందు డీజిల్ పోయడానికి జేసీబీ బొక్కనలో ఎక్కించారు. దాంతో అకస్మాత్తుగా జేసీబీ బొక్కనపై నుండి కింద పడిపోయింది. దీంతో వెంకటేష్ మెదడుకు తీవ్ర గాయం అవ్వడంతో అక్కడున్న కార్మికులు, యాజమాన్యం వెంటనే దగ్గర్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా మెరుగైన వైద్యం కోసం బేగంపేట్ లో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వెంకటేష్ భార్య స్రవంతి అతను తొందరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని స్రవంతి మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్ళింది. అయినా ఫలితం లేదు. అతను మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాక ఒక మూడు రోజుల్లో ఇంటిదగ్గర చనిపోవడం జరిగింది. కార్మికుడి భార్య స్రవంతి తన కుటుంబంకు న్యాయం చెయ్యాలని… పలుమార్లు కంపెనీ యాజమాన్యంని ఎన్నిసార్లు అడిగినా… యాజమాన్యం స్రవంతి కుటుంబం పట్ల నిర్లక్ష్యం వహించింది. స్రవంతి కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్ధం కాక… ఎవరైతే కార్మికులకు న్యాయం చేస్తారని తోటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని, బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి ఆవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని తన కార్యాలయం వద్దకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన “ఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ వద్దకు బయలుదేరి… యజమాన్యంతో పలుమార్లు చర్చించి… చనిపోయిన కార్మికుని కుటుంబానికి రావలసిన నష్టపరిహారం ఇప్పించారు. హాస్పటల్ ఖర్చులు మూడు లక్షల రూపాయలు, అలాగే చనిపోయిన కుటుంబ సభ్యుల భార్యా పిల్లలకి (6,50,000) రూపాయలు, మొత్తం కలిపి (9,50,000) రూపాయలు, చనిపోయిన కార్మికుని కుటుంబానికి చెక్కు రూపంలో అందజేశారు. కార్మికుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ…తమ కుటుంబానికి న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, పాల్గొన్నారు.
