కామ్రేడ్ యు రాములన్న మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటు….
రాములన్న స్ఫూర్తితో బలమైన కార్మిక ఉద్యమాలను నిర్మిద్దాం….
తోకల రమేష్, ఈసంపల్లి రాజేందర్
టియుసిఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు…
పెద్దపల్లి//గోదావరిఖని: సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ ఆధ్వర్యంలో అమరుడు, కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ యు. రాములు 22వ. వర్ధంతి సభ జరిగింది.
కామ్రేడ్ యు.రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, టియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోకల రమేష్, ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ.. కామ్రేడ్ యు.రాములన్న మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక వర్గం కోసం తన ఊపిరి ఉన్నంతకాలం పనిచేసిన విప్లవకారుడు కామ్రేడ్ యు.రాములన్న.
నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అమరుల స్ఫూర్తితో ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. నూతన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక ఉద్యమాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉన్నది సింగరేణి పరిరక్షణ కోసం, ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్ కార్మిక వర్గం హక్కుల కోసం అమరుల ఆశయాల సాధనలో ముందుకు సాగుదాం అని రాములన్న ఆశయాలను భుజాన వేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇంకా ఈ సభలో సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, మార్త రాములు, తిగుట్ల రాములు, ఇనుగాల రాజేశ్వర్, తుళ్ల శంకర్, చిలుక శంకర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
