ప్రజల గుండె చప్పుడు నుంచి పుట్టిన పార్టీయే జనసేన
ప్రజల కోసం ఎప్పుడూ అండగానే ఉంటుంది జనసేన
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి..
నెల్లూరు జిల్లా ప్రజల సంక్షేమం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని స్థాపించిన పార్టీ జనసేన పార్టీ అని కోవూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. బుచ్చి జొన్నవాడ సెంటర్లో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేకును కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లగ్జరీ లైఫ్ ను దాటి బయటకు వచ్చి ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం జనసేన పార్టీ స్థాపించారని అన్నారు. ప్రజలకు అండగా ప్రశ్నించే గొంతుగాజనసేన పార్టీ ఉంటుందని, జన సైనికులు జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తారన్నారు. మరో 100 ఏళ్లు జనసేన పార్టీ ఇలానే ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షుడు మాధవ్, షేక్. మున్వర్ భాష, జనసైనికులు పాల్గొన్నారు.
