పెన్షనర్ డే సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యం

TEJA NEWS

కాజీపేట

పెన్షనర్ డే సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పెన్షనర్ల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల కృషి వల్లే నేడు వ్యవస్థలు బలంగా నిలబడ్డాయని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండే పెన్షనర్ల అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పెన్షనర్లను ఎమ్మెల్యే సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన, తమ సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్,విజయ శ్రీ రజాలి ,డివిజన్ అధ్యక్షులు అజ్గర్ నాయకులు గుంటి కుమార్,సిరిల్ లారెన్స్,ఇప్ప శ్రీకాంత్,మధు,సమ్మయ్య,పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top