ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్లుగా గత పాలకులు మంత్రులతో శంకుస్థాపనలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికే పరిమితమయ్యారని విమర్శించారు. వాస్తవంగా పనులు జరగని పరిస్థితిని మార్చి, మొదట రూ.5 కోట్లుగా ఉన్న భవన నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.7 కోట్లకు రీ ఎస్టిమేట్ చేయించి, శంకుస్థాపనతో పాటు నిర్మాణ పనులను వేగవంతం చేశామని తెలిపారు.
ఈ ఆత్మగౌరవ భవనం ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సోదరులకు ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా భవన నిర్మాణంలో అందరు భాగస్వామ్యం కావాలని, నిత్యం సమయానుకూలంలో పనులను పరిశీలించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు కుల బాంధవులు మాట్లాడుతూ, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల్లో మున్నూరు కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ గతంలో తమ కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భవన నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి EV శ్రీనివాస్ రావు,మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు మానస రామప్రసాద్,విజయ లక్ష్మి సురేందర్ మరియు మున్నూరు కాపు పెద్దలు మంద ఐలయ్య, కటకం పెంటయ్య , గైనేని రాజన్ , కోరబోయిన సాంబయ్య, తోట వెంకన్న, దేవర కొండ విజయలక్ష్మి సురేందర్ , వేల్పుల మోహన్ రావు, పుప్పాల ప్రభాకర్, ఏనుగుల రాంప్రసాద్, కొత్త దశరథం, సాయిని రవీందర్ , పాటి శ్రీనివాస్ , మందాటి మహేందర్ , కనుకుంట్ల రవి కుమార్ , కందుల సృజన్ , పెరికారి శ్రీధర్ , పెంచాల గోపాల్ , బక్కి రాజ్కుమార్ , మాడిశెట్టి రాజకుమార్, సతీష్ , పుప్పాల రజిని కాంత్ , కొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
