- అబద్దలా పునాదులపై ఉన్న కాంగ్రెస్ కూలడం ఖాయం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం…………. బిఆర్ఎస్.
వనపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం అలివికాని,ఆచరణ సాధ్యం కాని 420హామీలు,6గ్యారంటీలు ఇచ్చి అమలు చేయలేక పల్లెపోరులో ప్రజల తీవ్ర వ్యతిరేకతకు గురైనారని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అన్నారు నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ కృష్ణ నాయక్ లు మాట్లాడారు ముందుగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ.
నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీని,కె.సి.ఆర్ ని ఆదరించారని ఇది తట్టుకోలేని ఏం.ఎల్.ఏ అసహనంతో ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
59మంది సర్పంచులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ
రేవంత్ రెడ్డిది ప్రచార ఆర్భాటం.
ప్రజాధనాని తన ప్రచార ఆర్భాటం కోసం 3000కోట్లు దుబారా చేశారని
అందాల పోటీలకు, తెలంగాణ సమ్మిట్,డిల్లీ పర్యటనలకు,ప్రజా పరిపాలన ప్రచారం కోసం,ఫుట్ బాల్ స్టేడియం కోసం ప్రజాధనాన్ని వాడి సంక్షేమ పథకాలు బంద్ పెట్టినారని వాకిటి.శ్రీధర్ ఆరోపించారు.
కె.సి.ఆర్ హయాములో 135గ్రామ పంచాయతీలకు గాను 122పంచాయితీలు గెలిపించి ప్రజల హృదయాలలో నిలిచారని
రేవంత్ పాలనలో వైఫల్యం చెందినందుకే 50శాతం పంచాయతీలకు పరిమితమైనారని ఎద్దేవా చేశారు.ప్రజలు కె.సి.ఆర్ సుస్థిర పాలన నిరంజన్ రెడ్డి ప్రజాపాలన కోరుకుంటున్నారని వాకిటి.శ్రీధర్ అన్నారు.
క్యాంపు కార్యాలయం ఎం.ఎల్.ఏ అబ్బ సొత్తు కాదు.
బి.ఆర్.ఎస్ సర్పంచులు నీ గేటు కూడా తొక్కరు.
రాబోయే బి.ఆర్.ఎస్ ప్రభంజనములో ఎం.ఎల్.ఏ కొట్టుకుపోవడం ఖాయమని మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్ విమర్శించారు
.
ఏం.ఎల్. ఎ ఎన్ని అరాచకాలు, ప్రలోభాలు,దౌర్జన్యాలకు పాల్పడినా ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీకి అండగా నిలిచి 59మంది సర్పంచులను గెలిపించినారని కృష్ణా నాయక్ విమర్శించారు.
నిరంజన్ రెడ్డి కట్టించిన క్యాంపు కార్యాలయంలో ఉంటూ బి.ఆర్.ఎస్ సర్పంచులను గేటు తొక్కనీయను అంటావా నిన్ను గేటు బయటికి మెడ పట్టి గెంటే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.
ఘనపురం మండలం సమావేశంకు తులం బంగారం,మహిళలకు 2500,వృద్ధులకు 4000,వికలాంగులకు 6000,నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా ఇచ్చిన తర్వాతనే రావాలని డిమాండ్ చేశారు.
రెండేండ్లలో ఏం.ఎల్.ఏ పీకింది ఏమీలేదని ఇంకా మూడేండ్లలో ఏమి పీకలేరని ప్రజలు గుర్తించారని ఇప్పటికైనా ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
ఈ సమావేశములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,పెబ్బర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ కర్రీస్వామి,నాయకులు రాళ్ళ.కృష్ణయ్య,ఎద్దుల. సాయి కుమార్,స్టార్.రహీమ్,జోహెబ్ హుస్సేన్ చిట్యాల.రాము,రామకృష్ణ పాల్గొన్నారు.
