మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది…

TEJA NEWS

మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది…

మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే..

మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే..

ఉమ్మడి వరంగల్ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ..

హన్మకొండ డిసిసి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టిపిసిసి ఉపాధ్యక్షురాలు శ్రీమతి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి , KUDA చైర్మన్, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి , వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…

మహిళల సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యం, కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పాత్రపై విస్తృతంగా మాట్లాడారు. మహిళా కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు మహిళల అభ్యున్నతికి, వారి రాజకీయ భాగస్వామ్యానికి, నాయకత్వ వికాసానికి కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేస్తూ వస్తోందని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజకీయ చరిత్రలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. మహిళలకు కేవలం మాటల్లో కాకుండా, అధికారంలో, పాలనలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక స్థానాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సాక్ష్యంగా నిలిచిందన్నారు…

భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని ఆయన గుర్తు చేశారు. దేశ అభివృద్ధి, భద్రత, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను పెంచడంలో ఆమె పోషించిన పాత్ర చారిత్రాత్మకమని కొనియాడారు. అదే విధంగా దేశ అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి స్థానంలో మహిళకు అవకాశం కల్పించి మహిళా గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని తెలిపారు…

మహిళల రాజకీయ హక్కుల సాధనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుండిందని, మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మహిళలకు శాసనసభలు, పార్లమెంట్‌లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నో దశాబ్దాలుగా నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు…

మహిళలు సమాజ నిర్మాణంలో కీలక శక్తిగా నిలుస్తారని, వారి అభిప్రాయాలు, నాయకత్వం, నిర్ణయాలు దేశాభివృద్ధికి అత్యంత అవసరమని ఆయన అన్నారు. మహిళా కాంగ్రెస్ నాయకులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మహిళా సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు…

రాబోయే రోజుల్లో మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని, ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ ఆశ్రయంగా నిలవాలని ఎమ్మెల్యే నాగరాజు గారు ఆకాంక్షించారు. మహిళల గౌరవం, భద్రత, అభివృద్ధి, రాజకీయ అవకాశాల విస్తరణలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు…

ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, జిల్లా మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..

You cannot copy content of this page

Scroll to Top