కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని పలు సమస్యలపై కలిసిన గణేష్ నగర్ వెల్ఫేర్

TEJA NEWS

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని పలు సమస్యలపై కలిసిన గణేష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.

చింతల్ సర్కిల్ పరిధిలోని గణేష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి తమ కాలినిలలో చేపట్టవలసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి షాపూర్ నగర్ లోని శ్రీశైలం గౌడ్ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందించారు..

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్. మాట్లాడుతూ గణేష్ నగర్ లో చేపట్టవలసిన అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులను తొందర్లోనే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు..

నియోజకవర్గం లోని పలు బస్తీలు మరియు కాలనీల నుండి వచ్చిన స్థానిక ప్రజల నుండి వినతులను సైతం స్వీకరించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు..

అదేవిధంగా జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేసి, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తానని గతంలోనే తెలిపినట్టు వారు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు,దుర్గారావు, లింగం యాదవ్, వెంకటేష్ యాదవ్, భాస్కర్, యాదగిరి గణేష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top