వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 280వ డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు గోవింద రాజా స్వామి ఆలయం కమిటీ ఆహ్వానం మేరకు, ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కే. నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గణేష్, ధర్మకర్తలు వేణు గౌడ్, బుచ్చిరెడ్డి, రవీందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిల్లి ఆంజనేయులు, సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, బోయిని వెంకటేష్, శ్రీధర్ వర్మ, కళ్యాణ్ గౌడ్, మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, గోగికర్ కరణ్, జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
