ములకలపల్లి ZPHS పాఠశాలలో విద్యార్థులకు వసతి గృహము నిర్మాణం

TEJA NEWS

ములకలపల్లి ZPHS పాఠశాలలో విద్యార్థులకు వసతి గృహము నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే

3.25 కోట్ల వ్యయం తో బాలురు G+2 వసతి గృహం నిర్మాణం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్న స్థానిక ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ములకలపల్లి లో 3.25 కోట్ల రూపాయల వ్యయం తో బాలురు వసతి గృహ నిర్మాణంని శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే జారే. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేపట్టారు. అదేవిధంగా నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంని ప్రారంభోచవం చేశారు. అంతరం మాట్లాడుతూ విద్యా, ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
2)ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాము వారి ఆధ్వర్యంలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు,అంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు,
3) ములకపల్లి రైతువేదిక లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిదికి సీఎంఆర్ఎఫ్ చేకులను దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు పంపిణి చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top