బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేదాజ్ఞులు కొనసాగింపు.

TEJA NEWS

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేదాజ్ఞులు కొనసాగింపు.

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపిఎస్.

 సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాధులు వస్తున్న నేపధ్యంలో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

మద్యం సేవించి మద్యం ప్రియులు వీధుల్లో, రోడ్లపై అసభ్యపదజాలంతో మాట్లాడుతుడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించింది. మద్యంప్రియుల ఆగడాలకు కళ్ళెం వేయడంతోపాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించబడే అవకాశం ఉంది. ఐపిసి 188. హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేదాజ్ఞలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

కమీషనర్ ఆఫ్ పోలీస్,
కరీంనగర్.

You cannot copy content of this page

Scroll to Top