పాతపట్నం నియోజకవర్గం ఎల్.యన్.పేట మండలం సొసైటీ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం

TEJA NEWS

పాతపట్నం నియోజకవర్గం ఎల్.యన్.పేట మండలం సొసైటీ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ …

▪️ పాతపట్నం నియోజకవర్గం ఎల్,యన్.పేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ చైర్మన్ గా కాగాన మన్మదారావు , డైరెక్టర్లుగా యరబాటి రాంబాబుగారు,కొయ్యాన శ్రీను బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షల మేరకు రైతుల శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు,రైతు సంఘ నాయకులు,నీటి సంఘ నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top