
మహిళా బిల్లుపై వివాదం…
గోదావరిఖని లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం యత్నం…..
–పోలీసుల అడ్డంకితో ఉద్రిక్తత….
పెద్దపల్లి//గోదావరిఖని: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు నిరసనగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మహిళా హక్కులు, సాధికారతకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల చర్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపించారు. అనంతరం దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని అడ్డుకోవడంతో, రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాల్చివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నప్పటికీ, మహిళా పోలీసులను ఏర్పాటు చేయకుండా మగ పోలీసులు మహిళలను అడ్డుకోవడం పట్ల కందుల సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బల్మూరి వనిత, సీనియర్ నాయకులు సులవ లక్ష్మీ నరసయ్య, పద్మ, చిలుక భారతి, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మెరుగు నరేష్ గౌడ్, బోడకుంటి సుభాష్, ఊరగొండ అపర్ణ, వెల్తూరి సరిత, రాజయ్య, అందే రాజ్ కుమార్ చారి, అంకరి భరత్, జనగామ శివరాం, సునీల్, ఇరుగురాల శివకుమార్, బియ్యాల మహేందర్, మాడ ప్రభాకర్ రెడ్డి, జక్కన బాలు, జక్కుల ప్రవీణ్, పద్మ, శిలారపు కళ్యాణ్, ఎరుకొండ తిరుపతి, బండారి శాం పటేల్, బుంగ మహేష్, మాదర బోయిన రాకేష్ తదితరులు పాల్గొన్నారు.