ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి

TEJA NEWS

ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి

జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

340 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు.

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తదుపరి నూతనకల్ మండలం గుండ్ల సింగారం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించేందుకు వ్యవసాయ, సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున 340 సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌళిక వసతులతో పాటు తేమ కొలిచే యంత్రాలు, టార్ఫలిన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు.

ఒక్కరోజే 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, రానున్న రోజులలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల నుండి 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నామన్నారు. లోడింగ్ చేసిన ధాన్యాన్ని మిల్లులలో వేగంగా అన్ లోడింగ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కొనుగోలుకు అనుగుణంగా లారీలను ఏర్పాటు చేయాలని, అవసరం అయితే లారీల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం సమయంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, అదే విదంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఒ ప్రవీణ్,
డి.ఎం. సివిల్ సప్లయస్ శ్రీధర్ రెడ్డి, డిఎస్ఓ మోహన్ బాబు ఆత్మకూరు, నూతనకల్లు మండల తహసీల్దారులు అమీన్ సింగ్ శ్రీనివాసరావు, ఎంపీడీవో హసీం, సునీత లు ఇతర అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top