స్థలం పై డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

TEJA NEWS

స్థలం పై డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

బీరప్ప నగర్ లో రహదారి వెడల్పు పేరిట మరమ్మతులు చేస్తుంటే వాటర్ లైన్ పగిలి మూడు రోజులైతున్నప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల నేడు బీరప్ప నగర్ ప్రజలు నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయాన్ని సిపిఐ నాయకత్వం కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఇవాళ సాయంత్రం లోగా మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ పరిష్కరించకపోతే రేపు ధర్నా నిర్వహిస్తామని ప్రజలంతా కలిసి హెచ్చరించడం జరిగింది.


ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ రోడ్డు వేసే క్రమంలో కొంతమంది అవసరాల కోసం రోడ్డు అలైన్మెంట్ ను మార్చడం వల్ల ఆ దారి వెంబడి ఉన్నటువంటి ఇంటి వాళ్లకు కొంత స్థలం ముందు భాగాన ఉండటం జరుగుతున్నది దీన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది ఆ ఇంటి యాజమాన్యాల దగ్గర 50 గజాల వాళ్లకు 50,000,80 గజాల వాళ్లకు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ విషయం సిపిఐ నాయకత్వానికి తెలియడం వల్ల నేడు బస్తి ప్రజలకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దని ఆ స్థలం ప్రభుత్వానిదేనని రానున్న రోజుల్లో ఆ స్థలంలో పాదచారుల బాట ఏర్పాటు చేపిస్తామని కాబట్టి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కోరడం జరిగింది.


ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, మహిళా సమైక్య అధ్యక్షురాలు హైమావతి, లక్ష్మి,నాగ లక్ష్మి, భాగ్యమ్మ, సోమేశ్వరి,రవీందర్ రెడ్డి,పి ఎన్ రెడ్డి,సువర్ణ బాలాజీ,ఉమా, నర్సింహా, కళ్యాణి,సత్యమ్మ,యాదయ్య,యూసఫ్,వనజ,ప్రభాకర్ రెడ్డి లు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top