విద్యావిధానాల అమల్లో మంత్రి లోకేశ్

TEJA NEWS

విద్యావిధానాల అమల్లో మంత్రి లోకేశ్ ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తున్నారు : ప్రత్తిపాటి

  • విద్యాబోధనతో పాటు, భోజనం.. యూనిఫామ్..పాఠశాలల ఆధునికీకరణలో ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులు.. విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేసి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
  • ఆడపిల్లల చదువు ఇంటికే వెలుగనే నిజాన్ని బాలికలు నిజం చేయాలి
  • నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధికి రూ.6 కోట్లకుపైగా నిధుల కేటాయింపు.
  • నాదెండ్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ.70 లక్షలతో నిర్మించ నున్న 3 తరగతి గదులకు శంకుస్థాపన చేసిన మాజీమంత్రి
  • విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆవిష్కరణలు పరిశీలించి వారిని, ఉపాధ్యాయుల్ని అభినందించిన ప్రత్తిపాటి

దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఎంతో కష్టపడి ఆ స్థానానికి వచ్చారని, ఒక లక్ష్యంతో జీవితాన్ని కొనసాగించి, ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళామూర్తులను బాలికలు ఆదర్శంగా తీసుకొని విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాల్ని కొనసాగించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నాదెండ్ల మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో రూ.70 లక్షలతో నిర్మించ తలపెట్టిన నూతన తరగతి గదులకు ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు.. ముందుగా మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీ, సావిత్రిబాయి పూలే, బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించిన ప్రత్తిపాటి.. బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన వారిని, ఉపాధ్యా యుల్ని అభినందించారు. విద్యార్థినులు తమ ప్రతిభతో తయారుచేసిన వివిధ రకాల ఆవిష్కరణల్ని పరిశీలించి వారిని అభినందించిన అనంతరం ప్రత్తిపాటి సభను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రజల ఆలోచనలకి అనుగుణంగానే విద్యావిధానాలు..
రాష్ట్రంలోని బాల, బాలికలకు మెరుగైన విద్యాబోధన అందించాలన్న గొప్ప లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. సబ్జెక్ట్ కు ఒక టీచర్ ఉండాలన్న నిర్ణయం లోకేశ్ దేనని, మరెవరూ ఆ విద్యాశాఖ నిర్వహించినా ఆది సాధ్యమయ్యేది కాదన్నారు. విద్యా ర్థులు ధరించే యూనిఫామ్ మొదలు, బోధనాంశాలు.. స్టడీ మెటీరియల్.. భోజనం.. ల్యాబ్ లు, కంప్యూటర్ బోధన వంటి వసతుల కల్పనలో లోకేశ్ ఉదారంగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంపై మంత్రి లోకేశ్ ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారని, వారి ఆలోచనలకి అనుగుణంగానే రాష్ట్రంలో బోధనావిధానాల్లో మార్పులు చేశారన్నారు. చిలకలూరిపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అభివృద్ధికి కూడా ప్రభుత్వం రూ.1.60లక్షలు కేటాయించిం దన్నారు. మొత్తం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పాఠశాలల అభివృద్ధికి దాదాపు రూ.6 కోట్లపైన నిధులు అందించారని ప్రత్తిపాటి తెలిపారు.

విద్యతోనే పేదరికం.. సమాజ అంతరాలు తొలగిపోతాయని, ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు, పది, ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించినప్పుడే ఉన్నత చదువలు తేలికవుతాయన్నారు. విద్యార్థుల అవసరాల్లో అతి ముఖ్యమైన ఆటస్థలం కేటాయింపుపై కూడా త్వరలోనే దృష్టి పెడతామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. ఆడపిల్లల చదువు ఇంటికే వెలుగనే నిజాన్ని బాలికలు నిజం చేయాలన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులందరి చదువులు పూర్తయ్యేనాటికి వారికి అవసరమైన ఉద్యోగాలు వారికై ఎదురు చూసేలా కూటమిప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు నెల్లూరి హరిబాబు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ మాధవి లత, ఎంఈవో నారాయణ రెడ్డి, కూటమి నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top