
విత్తనాల పంపిణీ
జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వినూత్న చర్యలు చేపట్టారు. ప్రతి నెల మొదటి గురువారం నిర్వహించే ‘గ్రామ ఆరోగ్యదర్శిని’ కార్యక్రమంలో భాగంగా, ఈ నెల 7న ప్రతి మండలంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.ఇందులో భాగంగా సుమారు 3,000 మందికి బెండ, తోటకూర, చిక్కుడు, టమాటా, చుక్కకూర వంటి విత్తనాలను పంపిణీ చేయాలని స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు నేకరికల్లు మండలంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు కలెక్టర్ స్వయంగా విత్తనాలను పంపిణీ చేశారు.