
ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలను పాటించాలని ఆదేశించిన……….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు, స్కానింగ్ కేంద్రాలు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010 ప్రకారం రేట్ చార్టులను ప్రదర్శించడంతో పాటు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మధ్యాహ్నం ఐ.డి. ఒ.సి కాన్ఫరెన్స్ హాల్లో ప్రయివేట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి, పలు దరఖాస్తులను సమీక్షించారు.
3 ఆసుపత్రులు, 3 క్లినిక్ లు, 1 డయాగ్నొస్టిక్ సెంటర్, 4 స్కానింగ్ కేంద్రాల కోసం పలువురు దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలన చేసింది. కొత్తగా ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న కిరణ్ గ్యాస్ ట్రోల్ లివర్ ఎండోస్కోపీ సెంటర్ క్లినిక్, డాక్టర్ మనిషా రెడ్డి పాలి క్లినిక్, గాయత్రి డెంటల్ క్లినిక్ లకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త హాస్పిటల్ కోసం దరఖాస్తు చేసుకున్న రవీంద్రబాబు హాస్పిటల్, హైందవ్ న్యూరో హాస్పిటల్, ఆర్య హాస్పిటల్ కి కమిటీ ఆమోదం తెలిపింది. వీటితోపాటు ఒక డయాగ్నస్టిక్ సెంటర్, నాలుగు(2కొత్తవి +2 రెన్యువల్) స్కానింగ్ కేంద్రాలకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా కలెక్టర్q మాట్లాడుతూ ఆసుపత్రులు నిబంధనలకు తు.చ. తప్పకుండ పాటించాలని, సకాలంలో రెన్యువల్ కు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆస్పత్రులు పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రులు, క్లినిక్ లలో రేట్ ఛార్ట్స్ తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా స్కానింగ్ కేంద్రాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా జాగ్రత్త పడాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. అటువంటి సంఘటనలు ఏవైనా జిల్లాలో ఉంటే దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సాయినాథ్ రెడ్డి, డి ఎస్పీ బాలాజీ నాయక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, డాక్టర్ బాబు, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, ఇతర డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.