
లేగుంటపాడు లో అవ్వ, తాతలకు,ఎమ్మెల్యే చే పెన్షన్ పంపిణీ
కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధి కి 48 కోట్లు నిధులు
2.59 కోట్లతో లేగుంటపాడులో అభివృద్ధి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు జిల్లా డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతన్నలకు అండగా ఉన్న కనిగిరి రిజర్వాయర్ ఆధునికరణకు 48 కోట్లు నిధులు సీఎం మంజూరు చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.కోవూరు మండలం లేగుంటపాడు లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారుపాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకుప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 3 ఉన్న పెన్షన్ ను 4వేలు చేసి అందిస్తున్నారని అవ్వ తాతలముఖంలో చిరునవ్వు కు కారణమయ్యాడని తెలిపారు. అలాగే మన లేగుంటపాడు పంచాయతీలో 2 కోట్ల 59 లక్షలతో 21 నెలల్లో అభివృద్ధి పనులు చేశామన్నారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతన్నల సంక్షేమమే మన ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. పెన్నా డెల్టా ఛైర్మెన్ రాజగోపాల్ రెడ్డి సేవలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి,ఎంపీపీ తుమ్మల పార్వతి, పోలంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు,బీద భాస్కరరావు,బత్తల రమేష్, బాల రవి, పిచ్చుక మధుసూదన్ రావు, గాదిరాజు అశోక్, పి.బాలకృష్ణ, మైనార్టీ నాయకులు జహంగీర్, జనసేన కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు, గ్రామ నాయకులు, కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.