వనపర్తిమున్సిపల్ లోని 13 14 17 వార్డులలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీలోని 13, 14, 17 వార్డులలో మార్నింగ్ వాక్ చేపట్టిఎన్నికల ప్రచారం నిర్వహించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి
ఈ సందర్భంగా వార్డుల్లోకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, తిలకం దిద్దుతూ, మంగళ హారతులు ఇస్తూ, డప్పు వాయిద్యాల మధ్యన, పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చాక
వనపర్తి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లాంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి నిరుపేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు
