జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామాపురం లో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహార పంపిణీ….పూర్వ విద్యార్థి, ప్రభుత్వ ఉపాధ్యాయులు షేక్ రఫీ…
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామాపురం లో గల 10వ తరగతి విద్యార్థులకు స్థానిక గ్రామ నివాసి, పూర్వ విద్యార్థి, ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినా షేక్ రఫీ పదివేల రూపాయలు అల్పాహార కొరకు అందచేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎన్జీ శివకుమారి మాట్లాడుతూ విద్యార్థులు అల్పాహారన్ని సద్వినియోగం చేసుకోని పదవ తరగతి లొ అత్యధిక మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు టీవైఎల్ఎన్ స్వామి, ఐ రామంజలి దేవి, చందా రాములు, ఎస్ అరుంధతి, డి వెంకట్ రెడ్డి, ఎన్ పరిమళమ్మ, కె వెంకన్న, కదిర బ్రహ్మారెడ్డి మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
