అర్హత గల ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలి…..
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి// ఇంటర్ ఉత్తీర్ణత సాధించి అర్హత గల ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దకాల్వలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల పోస్టర్ ను ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు సమీప ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లిలో నాణ్యమైన విద్య అందించే అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు, నైపుణ్యాల ఆధారిత కోర్సులు వంటి సౌకర్యాలు విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి అర్హత గల విద్యార్థి ఉన్నత విద్యలో కొనసాగాలని విద్యార్థులకు సూచించారు.
జిల్లావ్యాప్తంగా డిగ్రీ కళాశాల ప్రవేశాల ప్రచార కార్యక్రమాలు కౌన్సిలింగ్ సమావేశాలు, ప్రచార పత్రాల పంపిణీ కొనసాగించాలని కలెక్టర్ ప్రిన్సిపల్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. లక్ష్మి నర్సయ్య అధ్యాపకులు డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ మారుతి, మురళి, డాక్టర్ షుకుర్, డాక్టర్ నారాయణ , తదితరులు పాల్గొన్నారు.
