క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ రాణించాలి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ..

TEJA NEWS

క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ రాణించాలి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ కార్తికేయ గ్రౌండ్స్ లో వడ్డెర సంఘం వారి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడా పోటీల్లో రాణించాలని, గెలుపు కంటే క్రీడా స్ఫూర్తి, జట్టు కృషి, క్రమశిక్షణలే ఎక్కువ విలువైనవని తెలిపారు. తమ నైపుణ్యాలలో ప్రదర్శించడానికి శాశ్వత స్నేహబంధాలను పెంపొందించుకోవడానికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని జట్లుకు విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ టోర్నమెంటు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డపోతారం మున్సిపల్ బీఆర్ఎస్ యువ నాయకులు,గద్దె గణేష్, కుమార్ యాదవ్, అరికేల సురేష్ ముదిరాజ్ మరియు బౌరంపేట బీఆర్ఎస్ యువ నాయకులు కుమ్మరి మల్లేష్, వి.తిరుపతి, రాజు, బాల్రాజ్, బాలు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top