రేపటి పౌరులతో ఉల్లాసంగా గడిపిన మాజీమంత్రి

TEJA NEWS

రేపటి పౌరులతో ఉల్లాసంగా గడిపిన మాజీమంత్రి

శాసనసభ కార్యకలాపాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలన్న మంత్రి లోకేశ్ నిర్ణయం నిజంగా అద్భుతమని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో విద్యార్థులకు సభా మర్యాదలు, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని ప్రత్తిపాటి తెలిపారు. జరిగే అసెంబ్లీ సమావేశాలు తిలకించడానికి విచ్చేసిన యడ్లపాడు మండలం వంకాయలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ప్రత్తిపాటి ఉల్లాసంగా గడిపారు. అసెంబ్లీ చూడటం ఎలా ఉందని, ఏం నేర్చుకున్నారని విద్యార్థినీ, విద్యార్థులను ప్రత్తిపాటి ప్రశ్నించారు. వారిచ్చిన సమాధానాలపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ్యులు పితాని సత్యనారాయణతో కలిసి విద్యార్థినీ, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల కోరిక మేరకు శాసనసభ్యులు వారితో కలిసి ఫోటోలు దిగారు.

You cannot copy content of this page

Scroll to Top