మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సాయం

TEJA NEWS

మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సాయం అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

ములుగు జాకారం : ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు మహమ్మద్ జానీ పాషా తండ్రి అబ్జల్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి సీతక్క అన్నారు
అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన తిప్పారపు దేవరాజ్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమములో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top