లక్నవరంలో పంట కాలువలకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్

TEJA NEWS
  • లక్నవరంలో పంట కాలువలకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
    లక్నవరం చెరువు కింద ఉన్న ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు అందిస్తాం
    త్వరలో రామప్ప చెరువు నుండి కెనాయిల్ ద్వారా లక్నవరం చెరువును పూర్తిగా నింపుతాం


ములుగు జిల్లా : గోవిందరావుపేట లక్నవరం వద్ద పంట కాలువలకు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత కొంతకాలంగా రైతులకు నాట్లు వేసుకోవడానికి నీటి కొరత ఉందని తెలుసుకొని, ఇటీవల లక్నవరం సరస్సు తూముల మరమ్మతు పనుల అనంతరం నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం లక్నవరం సరస్సు 28 ఫీట్ల నీటి మట్టం కలిగి ఉందని, మొత్తం 33 ఫీట్లు సామర్థ్యాన్ని సరస్సు కలిగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు రైతుకు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top