గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ప్రచారం.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా నియమితులైన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 1వ,8వ,9వ, 10వ మరియు 11వ,12వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు [ కప్ప మమత, గూగుల్లోత్ విజయ, ఉపేందర్ రెడ్డి, గౌరపు స్వామి, శిరిన్ బేగం, వెల్దండ నరసింహ రెడ్డి ] తరుపున గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు…
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని మౌలిక వసతులు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు క్రింది స్థాయికి అందాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గజ్వేల్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా గురవేయాలని కోరారు…
అదేవిధంగా మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల ప్రజల గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెండింగ్ లో పెట్టిన ఆర్ఎన్ఆర్ [R&R]ప్యాకేజ్ నిధులు మరియు వారు ఎదుర్కొంటున్న ఇతర మౌలిక వసతుల సమస్యల గురించి తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు..
అదేవిధంగా గజ్వేల్ పట్టణంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని స్థానిక గౌడ సంఘం ప్రతినిధుల ఆహ్వానం మేరకు సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు….
కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు రాజా గౌడ్ ఇతర గౌడ సభ్యులు జంగం రమేష్ గౌడ్ అశోక్ గౌడ్, నరునె గౌడ్ ఇతర సభ్యులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
