*మేడ్చల్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

TEJA NEWS

మేడ్చల్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (పరాక్రమ దివస్) వేడుకలు ఘనంగా జరిగాయి :- మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!

మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఆర్ మల్లికార్జున్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలల్లో పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ పట్టణ పుర ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు.
ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు,ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతి (పరాక్రమ దివస్) శుభాకాంక్షలు సందర్భంగా జై హింద్ నినాదంతో ప్రజల్లో స్వాతంత్రోద్యమ పోరాట స్ఫూర్తిని రగిలించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారని తెలుపుతూ మీ రక్తాన్ని ఇవ్వండి‌ మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని గర్జించిన సింహం,నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారని దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావనికి ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సేవలను స్మరించుకోవాలని,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలుపుతూ ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి కూడా వెనుకాడని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అంకితం చేసిన అగ్రశ్రేణి నాయకుడని అన్నారు.ఆయన చూపిన ధైర్యం,క్రమశిక్షణ,దేశభక్తి భావజాలమే నేటి రాజకీయ నాయకులు మరియు యువత అనుసరించాల్సిన మార్గమని మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పేర్కొన్నారు.దేశం కోసం పోరాడిన నేతాజీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఇలాంటి కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ మల్లికార్జున్ స్వామి సేవా సంస్థ చైర్మన్,మాజీ యం పి టి సి సభ్యులు ఆర్ మల్లికార్జున్ స్వామి,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ,మాజీ వార్డు మెంబర్ ధాత్రిక లక్ష్మణ్ వంజరి,యువ నాయకులు సత్యనారాయణ రాజి రెడ్డి,పెంజర్ల సాయి యాదవ్,బాలు,సునీల్,రామకృష్ణ,బద్రినాథ్ పంతులు,కవి రాజు,నాగరాజు స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు,మేడ్చల్ పట్టణ పుర ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top