టీటీడీకి మాజీ రైల్వే ఉద్యోగి రూ.10 లక్షలు విరాళం…..

TEJA NEWS

టీటీడీకి మాజీ రైల్వే ఉద్యోగి రూ.10 లక్షలు విరాళం

తిరుపతి: బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్, మాజీ రైల్వే ఉద్యోగి కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు సోమవారం గిరిధర్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్ ను అందజేశారు.

You cannot copy content of this page

Scroll to Top