సూపర్ జిఎస్టి పై మున్సిపల్ ర్యాలీ

TEJA NEWS

సూపర్ జిఎస్టి పై మున్సిపల్ ర్యాలీ

తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జి.ఎస్.టి. 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ 2.0 వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి టౌన్ క్లబ్ కూడలి వరకు నగరపాలక సంస్థ, జిఎస్టి సిబ్బంది స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ సూపర్ జి.ఎస్.టి. 2.0 పై నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించామని, కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశామని అన్నారు. స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేకంగా పోటీలు నిర్వహించామని తెలిపారు. స్కూటర్ ర్యాలీ ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జి.ఎస్.టి. పన్ను రేటును రెండు స్లాబ్‌లుగా మార్చాయని, అంటే 28శాతం నుండి 18 శాతం… 12 నుండి 5 శాతం కి తగ్గించబడిందని తెలిపారు. అలాగే కొన్ని వస్తువులు 0శాతం అమలులోకి వచ్చాయని తెలిపారు. ఈ సూపర్ జి. ఎస్. టీ 2.0 తగ్గింపుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, నగరపాలక, జి.ఎస్.టీ. సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top