ప్రభుత్వం అంటేనే అభివృద్ధి – సంక్షేమం

TEJA NEWS

ప్రభుత్వం అంటేనే అభివృద్ధి – సంక్షేమం

అక్రమాలకు పాల్పడితే సహించను.

గుడిపల్లి కాలవపై బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి50 లక్షలతో గుడిపల్లి కాలవపై బ్రిడ్జి నిర్మాణం మరియు కాలువకు ఇరు వైపులా రివీట్మెంట్ వాల్ నిర్మాణానికి ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. గుడిపల్లి కాలవపై బ్రిడ్జి నిర్మాణం బుచ్చిరెడ్డి పాళెం వాసుల దశాబ్దాల కల అన్నారు. గుడిపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం మరియు కాలువకు ఇరు వైపులా రివీట్మెంట్ వాల్ నిర్మిస్తానన్న ఎన్నికల నాటి హామి నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దుకుంటూ నిధుల వెసలుబాటును బట్టి దశల వారీగా పట్టణంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.

గుడిపల్లి కాలవ పై బ్రిడ్జి నిర్మాణం ద్వారా స్థానిక 11 వ వార్డు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందనన్నారు. బ్రిడ్జ్ నిర్మాణాన్ని అత్యంత నాణ్య ప్రమాణాలతో.. పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ మరియు అధికారులను ఆదేశించారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని గ్రేడ్-2 స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మరిన్ని నిధులు, మెరుగైన వసతులు సమకూరనున్నాయన్నారు. అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు పాల్పడే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ డి బాలకృష్ణ, ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య, టిడిపి గౌరవ అధ్యక్షులు టంగుటూరు మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాచూరు సత్యనారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు బత్తల హరికృష్ణ, వింజం రామానాయుడు, షేక్ పర్వీన్ లతో పాటు పట్టణ కౌన్సిలర్లు మరియు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top