ప్రజల బాగోగుల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి మన పవన్ అన్న
ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీయే జనసేన
రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తన సొంత నిధులు
గత వైసీపీలో విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యం..
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కోసం కష్టపడే కార్యకర్తకు భరోసా
సభ్యత్వం ద్వారా 5 లక్షల ప్రమాద బీమా కుటుంబానికి భరోసా
తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొబ్బేపల్లి శ్రీనివాస్.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం జనసేన పార్టీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉద్యమి సాధాక్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొచ్చులపల్లి శ్రీనివాసులు విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోవూరులో ఉద్యమి సాధాక్ సభ్యత నమోదు కార్యక్రమానికి రావడం జరిగింది మన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం స్వార్థం లేని నాయకుడితో పనిచేస్తున్నాం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు అలాగే మన నాయకుడు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తూ తన సొంత నిధులను సైతం ప్రజల ప్రయోజనాలకు ఖర్చు చేస్తున్న ఏకైక నేత మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం అరాచకాలు తప్ప అభివృద్ధి లేదన్నారు.
సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెట్టారుఅన్నారు.ఉప ముఖ్యమంత్రి హోదాలో పల్లె పండుగ పేరుతో గ్రామాలలో రహదారుల అభివృద్ధి చేశారన్నారు. అటవీ ప్రాంతాలలో రహదారులు లేక ఇబ్బంది పడుతున్న గిరిజన అవసరాలను తీర్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోపాటు దేశంలో గుర్తింపు పొందారు అన్నారు. జనసేన క్రియాశీల సభ్యత్వం ద్వారా కార్యకర్తల కుటుంబాలకు భరోసా కలుగుతుందని ప్రతి జనసేన కార్యకర్త మంచి నాయకుడిగా ఎదగాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చెప్పిన శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు షేక్. ఆల్తాఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్. మున్వర్, యం.పవన్ కుమార్, దిలీప్, సాయి, వినయ్, లోకేష్, మాధవ్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
