TEJA NEWS

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు,ప్రజాప్రతినిధులకు ,కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు మరియు ​ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందోత్సాహల మధ్య సంక్రాంతి పండగను జరుపుకోవాలాని మనసారా కోరుకుంటూ సంక్రాంతి పండుగ ​శుభాకాంక్షలు​ తెలియజేసిన PAC చైర్మన్ అరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సంక్రాతి అంటే తెలుగు ప్రజల పెద్ద పండుగ అని వరుసగా నాలుగు రోజుల పాటు ఈ పండుగని జరుపుతారు అని. సంక్రాంతి రోజులలో పిండివంటలని తయారు చేయడం ఆనవాయితీ అని సంక్రాంతి రాక ముందే అనేక రకాల పిండి వంటలని తయారు చేస్తారు అని అలానే కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఘనంగా చేస్తారు అని పండుగ అని PAC చైర్మన్ గాంధీ తెలియజేసారు.అలానే చాలా మంది పితృదేవతలకు తర్పణాలు వదులుతారు అని అలానే సంక్రాంతి అంటే గంగిరెద్దుల విన్యాసాలు, చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు ఆ ఎద్దులు నాట్యం చేస్తాయి అని ఇది కూడా కేవలం సంక్రాంతి నాడే చూడగలిగే దృశ్యం. ఇక మరో ప్రత్యేకం ఏమిటంటే హరిదాసులు. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ కృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం అని ఆధ్యాత్మిక గీతాలని పాడుతూ గజ్జెలతో నాట్యం చేస్తున్నప్పుడు చూస్తే ఎంతో రమణీయంగా ఉంటుంది అని పెద్దలు కూడా పిల్లల తో కలిసి గాలిపటాలని ఎగురవేస్తారు అని ఇవన్నీ చూస్తే చూడ ముచ్చటగా ఉంటుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియజేసారు.