ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మరోసారి హరీష్ రావు భేటీ

TEJA NEWS

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మరోసారి హరీష్ రావు భేటీ..!!

ఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశం అయ్యారు. ఎర్రవల్లిలోని ఫౌమ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలా లేదా అన్న అంశంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకే విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. నేరుగా విచారణకు హాజరుకావాలా? లేదా వర్చువల్‌గా హాజరుకావాలా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఇప్పటికే కేసీఆర్ విచారణకు హాజరవుతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది

You cannot copy content of this page

Scroll to Top