ఒక్కసారి అవకాశం అన్నాడు… ప్రజలనువంచించిన ముఖ్యమంత్రి

TEJA NEWS

ఒక్కసారి అవకాశం అన్నాడు… ప్రజలనువంచించిన ముఖ్యమంత్రి

నిర్మాణాలు కె.సి.ఆర్ వి
విధ్వంసాలు రేవంత్ రెడ్డివి

అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా ని నిరంజన్ రెడ్డి ప్రశ్న

వనపర్తి : ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడిగితే అవకాశం ఇచ్చిన ప్రజల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంచించాడని నిర్మాణాత్మకమైన అభివృద్ధిని కెసిఆర్ చేపడితే వాటిని రేవంత్ రెడ్డి విధ్వంసాలు చేస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు హామీలు గ్యారెంటీ ల పేరుతో అబద్దాలకు గ్రేట్ అంబాసిడర్ గా మారిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్నా అని మాజీ మంత్రి ఓటర్లను సూటిగా ప్రశ్నించారు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
ఎన్నికల ప్రచార జోస్ పెంచి అభ్యర్థులలో ఉత్సాహం పెంచి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిప్రజల ఆశీసులు పొందుతున్నారు
1,2,13,14వార్డులో బి.ఆర్.ఎస్ అభ్యర్థులు కాగితాల.శారద,ఉందేకోటి.శివ,పి.రాజు,పవిత్ర భాను లతరపున కమాన్ చౌరస్తాలో “కార్నర్ “మీటింగులో పాల్గొని ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
16ఏండ్ల క్రింద జిల్లా ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం కోసం 55రకాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తే నిర్మాణాలు చేతకాని రేవంత్ రెడ్డి జిల్లాను రద్దు చేస్తానంటున్నాడు జిల్లా రద్దు చేసే వాళ్లకు ఓట్లు వేయాలనా అని ప్రశ్నించారు.
మహిళలకు 2500,కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం,ఆసరా పింఛన్లు 4000,రైతు భరోసా 15000,కె.సి.ఆర్ కిట్టు, విద్యార్థినులకు స్కూటీలు ఎగ్గట్టారని మున్సిపల్ ఎన్నికలలో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు 42శాతం పెంచి వారి ప్రతిష్ట పెంచారని,1లక్ష 63వేల ఉద్యోగాలు ఇచ్చి యువతను ఆదుకున్నారని కె.సి.ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమములో గట్టు యాదవ్,బి.లక్ష్మయ్య, రమేష్ గౌడ్,నందిమల్ల.అశోక్,వేణు గోపాల్,గులాం ఖాదర్ ఖాన్,నీలస్వామి, బొబ్బిలి. ప్రేమ్ కుమార్, సయ్యద్.జమీల్, జోహెబ్ హుస్సేన్ చిట్యాల.రాము,నాగమ్మ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top