హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ మరియు ఇందిరా నగర్

TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ మరియు ఇందిరా నగర్ కాలనీ వరకు నూతనంగా నిర్మించ ఈ వలసిన సేవరేజ్ లైన్ కొరకు విద్యుత్, HMWSSB మరియు GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలసి జాయింట్ ఇన్స్పెక్షన్ లో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, విద్యుత్, HMWSSB మరియు GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అని, HT లైన్ కింద నుండి ఉన్నందున, జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించి, సేవరేజ్ లైన్ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించామని చెప్పడం జరిగింది, అలానే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అదేవిధంగా ప్రజలు అందరూ కలిసి డివిజన్ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, డివిజన్ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HMWSSB ఏఈ ప్రియాంక , సూపర్వైజర్ నరేంద్ర, ఎలక్ట్రికల్ ఏఈ దయానంద్ , GHMC ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top