తుడ” చైర్మన్ గ్రామంలో హోమియోపతి వైద్య శిబిరం

TEJA NEWS

తుడ” చైర్మన్ గ్రామంలో హోమియోపతి వైద్య శిబిరం

చంద్రగిరి: తిరుపతికి చెందిన క్లినికల్ రీసెర్చ్ యూనిట్ సహకారంతో
రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గ్రామం
పెరుమాళ్ళ పల్లి లో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం జరిగింది. ఇందులో రిటైర్డ్ ఎంప్లాయిస్ తో పాటు గ్రామస్థులు వైద్య పరిక్షలు నిర్వహించుకున్నారు. శిబిరంలో పాల్గొన్న వైద్యులు తగిన ఔషదాలు అందజేశారు. ఇలాంటి వైద్య సేవలను తమకు దగ్గరగా అందుబాటులోకి తేవడం పట్ల గ్రామస్తులు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ సిబ్బంది సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రమోహన్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top