ప్రజల ఈ వర్షాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి

TEJA NEWS

ప్రజల ఈ వర్షాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి
కోవూరు నియోజకవర్గ ప్రజలకు కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కోవూరు ప్రజలు కు భారీ వర్షాల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు పాటించండి.ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఇంటి వద్దనే ఉండాలి, రైతులు తమ పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలి,విద్యుత్ సిబ్బంది అప్రమత్తగా ఉండాలి ఈదురు గాలులకు విద్యుత్ లైన్ లో తెగిపడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ లైన్ల కింద ఉండరాదు చెట్లు కూలే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలి నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళరాదు, ఎమర్జెన్సీ సర్వీసులు సిద్ధంగా ఉన్నాయని కోవూరు అధికారులు తెలిపారు.పెన్నా నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — సోమశిల డ్యాం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్థానిక పంచాయతీ సిబ్బందిని సచివాలయ అధికారులకు కోవూరు ఎమ్మార్వో కి మరియు కోవూరు పోలీస్ సిబ్బందిని సంప్రదించండి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top