ప్రజాప్రతినిధులే దళితుల పట్ల వివక్షణను తొలగించుకోలేకపోతే ఎలా?..

TEJA NEWS

ప్రజాప్రతినిధులే దళితుల పట్ల వివక్షణను తొలగించుకోలేకపోతే ఎలా?..

పదవులు ఇస్తే సరిపోదు అధికారాలను ఇవ్వండి.. లోక్ సత్తా పార్టీ..

అమరావతి చిలకలూరిపేట

భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే గొప్ప రాజ్యాంగం భారతదేశినిదని, ఏడున్నర దశాబ్దాలుగా భారతదేశంలో అమలవుతున్నా, ఇంకా ఈ దేశంలో కుల వివక్షత నాయకుల మనసుల్లో నుండి తొలగించుకోలేకపోవడం అత్యంత విచారకరమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ అన్నారు.
కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆదోని మండలం ఢాణాపురంలో ప్రథమ పౌరుడైన దళిత సర్పంచ్ కులాన్ని బహిరంగ వేదిక మీద ప్రస్తావించి కులం కారణంగా ఆయనను వేదిక మీదకు ఆహ్వానించకపోవడమే కాకుండా, ఎమ్మెల్యే “అయ్యా సర్పంచి నువ్వు రా” అని పిలుస్తుంటే ఎమ్మెల్యే ప్రక్కనున్న మహిళ నాయకురాలు సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన వాడు అని బహిరంగంగా మాట్లాడుతున్నారు అంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు? పొలిటికల్ రిజర్వేషన్ ద్వారా ఎన్నిక కాబడిన సర్పంచ్ స్థానాలలో ఉప సర్పంచ్ లు పెత్తనం చేస్తున్న సంగతి కొన్ని చోట్ల జరుగుతుందని అన్నారు.


రాజ్యాంగ నిర్మాతలు చట్టసభలలో పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించింది కేవలం సంఖ్యా బలం కోసం కాదని నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారంలో దళితులకు వాటా ఉండాలని వారు కోరుకున్నారని అన్నారు. ఇది కేవలం ఆదోని నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదని దశాబ్దాలుగా చట్ట సభలకు వివిధ హోదాల్లో ఎన్నికైన దళితులు ఎక్కడో ఒకచోట ,ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. నిర్ణయాధికారం లేని పదవులలో ఎన్ని దశాబ్దాలు నాయకులుగా ఉన్నా రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన లక్ష్యాలను సాధించటం సాధ్యం కాదు అని అన్నారు. ఇప్పటికైనా ఆయా వర్గాల్లోని మేధావులు, నిజాయితీపరులు రాజకీయాలలో తగిన పాత్ర పోషించి సమాజంలో మార్పుకు నాంది కావాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top