గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం..!

TEJA NEWS

గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం..!

అనపూర్ణ కాంప్లెక్స్‌లోని షాప్ నంబర్ 106లో అక్రమంగా నిల్వ ఉంచిన ₹97 లక్షల విలువైన కల్తీ సిగరెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు, సిగరెట్లను నిల్వ చేసిన గోదామును సీజ్ చేశారు.

ఈ నకిలీ సిగరెట్లు ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్‌లోకి వెళ్లేలా సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

అక్రమ సిగరెట్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది.

సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top