‘సూపర్ GST – ఆరోగ్యం, జీవితం కోసం సూపర్ ఆదా’..

TEJA NEWS

సూపర్ GST – ఆరోగ్యం, జీవితం కోసం సూపర్ ఆదా’..

యడ్లపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని సచివాలయాలలో గురువారం “సూపర్ GST – ఆరోగ్యం, జీవితం కోసం సూపర్ ఆదా” కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జిఎస్టీ 2.0’ సంస్కరణల వివరాలను ప్రజలకు తెలియజేశారు.ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జిఎస్టీ చర్యల ద్వారా నిత్యావసర వస్తువులు, మందులు,వైద్య పరికరాలపై పన్నులు తగ్గించడంతో ప్రజలకు ఆర్థిక పరంగా మేలు కలుగుతోందని వైద్యాధికారులు తెలిపారు.జిఎస్టీ పన్ను తగ్గింపుతో సాధారణ మందుల ధరలతో పాటు క్యాన్సర్,షుగర్, రక్తపోటు,గుండె సంబంధిత వ్యాధుల మందుల ధరలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు.అలాగే అరుదైన వ్యాధులు, అవయవ మార్పిడి సంబంధిత ఔషధాలు,ఆరోగ్య బీమా,జీవ బీమాలపై జిఎస్టీ పూర్తిగా తగ్గించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి,గ్రామ పెద్దలు,మండల వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top