కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం.

TEJA NEWS

కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం.

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి….

ఏఐటియుసి కేంద్ర కమిటి సమావేశంలో సీతారామయ్య, రాజ్ కుమార్ ల వెల్లడి….

పెద్దపల్లి :/గోదావరిఖని సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు పేర్కొన్నారు.

గోదావరిఖని లో జరిగిన ఏఐటియుసి కేంద్ర కమిటి సమావేశంలో జరిగిన వివరాలను వారు వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటియుసి తో నవంబర్ 2024 , మార్చి 2025 లో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలు డిమాండ్ లను అంగీకరించి, అమలు చేయడం లేదని వారు ఆరోపించారు.

ముఖ్యంగా స్వంత ఇంటి పథకాన్ని, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ చెల్లింపు లపై సర్క్యులర్ లను జారీ చేయకుండా కార్మికుల ను మోసం చేస్తుందని వారు ఆరోపించారు. మెడికల్ బోర్డు ను ఏ.సి.బి విచారణ పేరుతో నిలిపి వేశారని వారు ఆరోపించారు. అనారోగ్యం వల్ల కార్మికులు చాలా మంది మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు కు పిలువ కుండా కాలయాపన చేస్తూ కార్మికుల ను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.

మారుపేర్లు విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంటు లకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యం సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వారికి ఉద్యోగాలు రావడం లేదని వారు ఆరోపించారు. జనరల్ సమ్మె లో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికుల నుంచి జీతం రికవరీ చేస్తామని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దానిని వెంటనే రద్దు చేసి రికవరీ చేయొద్దని వారు డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం సింగరేణి కి కొత్త గనులు ఇవ్వకుండా తెలంగాణ లో ఉన్న సింగరేణి సంస్థ ను నిర్వీర్యం చేస్తుందని వారు ఆరోపించారు. వేలం తో సంబంధం లేకుండా తెలంగాణ లో ఉన్న కొత్త గనులు సింగరేణి కి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

సింగరేణి లో మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్ మెన్ ల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, లేకుంటే సమ్మె కు పిలుపునిస్తామని వారు పేర్కొన్నారు.

ఇంకా ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కే.సారయ్య, వై.వి.రావు, ముస్కె సమ్మయ్య, మడ్డి ఎల్లా గౌడ్, కే.వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు అక్బర్ అలీ, కవ్వంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, నాయకులు బాజీ సైదా, మల్లికార్జున్, రాంగోపాల్, రమేశ్, తిరుపతి, మల్లేష్, జీగురు రవిందర్, ఎం.ఆర్.సి రెడ్డి, రంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top